logo

ఆరోగ్యమైన వరి నారతో నాణ్యమైన దిగుబడి: ఏఓ పవన్ కుమార్.

బండి ఆత్మకూరు (AIMA MEDIA): మండలం ఈర్నపాడు అయ్యవారి కోడూరు గ్రామంలో సాగు చేసిన వరి నారుమడి మండల వ్యవసాయధికారి పవన్ కుమార్ పరిశీలించారు .వారు మాట్లాడుతూ.. నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు ఇప్పటికే వరి నాట్లు వేసుకున్నారు, వరి నారుకి నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, కీటకాలు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన పంటను పొందవచ్చని, నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో నాటే వరకు రైతులు తగిన మెళకువలు పాటించాలని ఏఓ రైతులను సూచించారు. ఒక ఎకరా నారుమడికి నత్రజని 2 కిలో భాస్వరం 2 కిలో పొటాష్ 1 కిలో పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ 2 క్వింటాలు నత్రజని 1 కేజీ మ్యాంకోజెబ్ + కార్బెండిజమ్ 2 గ్రా పిచికారి చేయాలని, జింకు దాతు లోపం నివారణ ఎకరా నారుమడికి జింక్ సల్ఫేట్ 500 గ్రా. వేసుకోవాలని ఏఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో వారితోపాటు వ్యవసాయ విస్తరణ సిబ్బంది నాంకీ బాయ్ పలువురు రైతులు పాల్గొన్నారు.

0
0 views