logo

దేవుని కడప బ్రహ్మోత్సవాల సందర్భంగా కడప నగరాన్ని టిటిడి వారు దీపాలంకరణతో చేయాలి

దేవుని కడప బ్రహ్మోత్సవాల సందర్భంగా కడప నగరాన్ని టిటిడి వారు దీపాలంకరణతో చేయాలి
హిందూ ఐక్యవేదిక కమిటీ
కడప మన జన ప్రగతి.
కడప నగరంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి తొలిగడప దేవుని కడప ఈనెల 18వ తేదీ నుంచి పది రోజులు జరుగు బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్ర ప్రభుత్వం కడప నగరాన్ని రింగ్ రోడ్డు సర్కిళ్లను దేదీప్యమానముగా దీపాలంకరణ స్వామి వారి దశావతారాలను కడప నగర సర్కిల్ రింగురోడ్డు సర్కిల్లో నమో వెంకటేశాయ నమో నారాయణ ముఖ్యంగా కృష్ణ సర్కిల్ వద్ద వచ్చేటట్టుగా చేయవలసినదిగా జిల్లా కలెక్టర్, కడప నగరపాలక సంస్థ కమిషనర్ లను హిందూ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కల్లూరు విజయానంద రెడ్డి కోరారు. శనివారం ఈ సందర్భంగా కడప వైయస్సార్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుంచి పది రోజులు దేవుని కడప బ్రహ్మోత్సవాలు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని టిటిడి సంస్థానం వారిని కడప నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి రెడ్డి ని కడప నగర ప్రజలు నుంచి కులాల మతాల కతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రజల తరపున ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కే. తిరుమల, వర్మ, చిట్టి, ఉమామహేశ్వరరావు, కేఎస్. రఘునాధ, వెంకటరాయుడు, కృష్ణ మనీ రాధాకృష్ణ పాల్గొన్నారు.

5
78 views