logo

టీఎన్ఎస్ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

Press Note:- 3-1-2026
Kadapa

టీఎన్ఎస్ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

కడప ద్వారక నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి గార్ల చేతుల మీదగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టిఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ రూపొందించిన 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల వారికి అండగా ఉంటూ పనిచేస్తున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులను అభినందించారు. జిల్లాలో ఉన్న విద్యార్థి విద్యార్థినీలకు, అధికారులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాంప్రసాద్ రెడ్డి, అశోక్ రెడ్డి, వలి, బాలకృష్ణారెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రమేష్, సంతోష్, అక్షయ్ కుమార్ రెడ్డి, విగ్నేశ్వర్, సురేష్ రెడ్డి, ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు.

5
777 views