logo

ఉపాధి హామీ పథకం యధావిధిగా కొనసాగించేంతవరకు పోరాటం చేస్తాం*

*ఉపాధి హామీ పథకం యధావిధిగా కొనసాగించేంతవరకు పోరాటం చేస్తాం*

*కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి.విజయ జ్యోతి*

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యధావిధిగా కొనసాగేంతవరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి తెలిపారు
ఈ సందర్భంగా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 2006 ఫిబ్రవరి 2 తేదీన గౌరవ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ , వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో అనంతపురంలో ఉపాధి హామీ పథకం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి నిధులు మొత్తం కేంద్రం సమకూర్చే విధంగా చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చట్టం చేసి ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేయడం దారుణం అన్నారు ఇప్పుడు చేసే చట్టంలో కేంద్రం 60% రాష్ట్ర ప్రభుత్వం 40% అని చేయడం చాలా దారుణం అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కాల క్రమేన అందించలేవని అందువల్ల ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు అందువల్ల ఇది మళ్లీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఏమి పొందుపరిచారో అవి జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతామని ఆమె తెలిపారు అంతేకాకుండా ఈనెల 5వ తేదీ నుండి ఏఐసీసీ, రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జి రామ్ జీ చట్టం తీసుకురాకుండా పోరాటం చేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాపురం నియోజవర్గ ఇన్చార్జ్ అశోక్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఇర్ఫాన్ భాష , కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సయ్యద్ గౌస్ పీర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుశీల్ కుమార్ , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు మామీళ్ళ బాబు, రాష్ట్ర కార్మిక ఆర్గనైజింగ్ సెక్రటరీ పైరోజ్ హుస్సేన్,పెళ్లి మర్రి మండల పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా , డివిజన్ ఇన్చార్జులు ముబారక్ భాషా , జాబిర్ అలీ , అంజన్ కుమార్ యాదవ్ , దాసరి శ్రీనివాసులు ,సంజయ్ కాంత ,షామీర్ భాష , సర్దార్ భాష , శామీర్ హుస్సేన్, సిద్ధిక్, తదితరులు పాల్గొన్నారు

5
468 views