logo

బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన 400 మంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఖండువ కప్పి పార్టీలోని ఆహ్వానించిన జాన్సన్ నాయక్ .


ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఉట్నూర్ లక్కారం చెందిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, సుమారు 400 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ గులబి ఖండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.బీజేపీ ముఖ్య నాయకులు జాదవ్ రవి , పవర్ గణేష్ , రాథోడ్ రామారావు నాయక్ , ఫకీర్ గుట్ట రాథోడ్ , సచిన్ జాదవ్, ఉమాజీ నాయక్ , వేణునగర్–కేబీనగర్ వాసి రామ్ నాయక్ , రోహిత్ (వేణునగర్), నవోదయనగర్ ప్రెసిడెంట్ తరుణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్. బీజేపీ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఖానాపూర్ ప్రజల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.అలాగే, అందరం కలిసికట్టుగా పనిచేసి వచ్చే ప్రతి ఎన్నికలో బీఆర్ఎస్ జెండాను ఎగరవేద్దాం అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శక్తి మరింతగా పెరిగి, ప్రజల ఆశయాలు నెరవేరే దిశగా పోరాడుతూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లక్కారం గ్రామ సర్పంచ్ అజ్మీరా రేణుకా , మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

3
692 views