logo

డిసెంబర్ 31 యువత ఇంటి వద్దనే చేసుకోవాలి లేదంటే సీరియస్ డి.ఎస్.పి

రాజన్న సిరిసిల్ల జిల్లా డివిజన్ లో యూత్ ప్రశాంతంగా డిసెంబర్ 31 జరుపుకోవాలి ఇండ్లలో మాత్రమే జరుపుకోవాలి తప్ప రోడ్లపై తిరిగి తాగి వాహనాలు నడిపితే కచ్చితంగా తల్లిదండ్రులపై వాహనాలు ఇచ్చిన వ్యక్తులపై కేసులయితాయి దీన్ని గుర్తుపెట్టుకుని యువతను రోడ్డుపైకి రానివ్వకుండా చూడాలని సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్ర చారి, అన్నారు ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితిలో చేయకూడదు అలా చేసిన వారిపై చట్ట రిత్య కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి అన్నారు ఇంటి వద్దనే సెలబ్రేట్స్ చేసుకోవాలి తప్ప ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి నేను ఎమ్మెల్యే కొడుకును నేను జెడ్పిటిసి కొడుకును నేను మున్సిపల్ చైర్మన్ కొడుకును నేను సర్పంచ్ కొడుకును మా నాన్న పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెప్పితే సాధారణ వ్యక్తుల కన్నా వీరిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి దీనిపై అందరూ చట్టానికి లోబడి పోలీసులకు సహకరించాలని లేనియెడల కఠినమైన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్ర చారి యువతకు హెచ్చరిక జారీ చేశారు.

5
355 views