రాజన్నపేటకు కొత్త గ్రామ పంచాయతీ శరభవరం పంచాయతీ పాలకవర్గం ఆమోదం
అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, శరభవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రాజన్నపేట గ్రామాన్ని స్వతంత్ర గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.గ్రామ సచివాలయంలో సోమవారం (22.12.2025) మధ్యాహ్నం 2 గంటలకు సర్పంచ్ దాసరి రాజులమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామసభలో నివాసులు ఆమోదించిన తీర్మానాన్ని పాలకవర్గ సభ్యులు చర్చించి తీర్మానం సంఖ్య 215 కింద ఆమోదం తెలిపారు.పంచాయతీ కార్యదర్శి సంతకంతో తీర్మాన ప్రతిని సిద్ధం చేసి, సంబంధిత అధికారులకు సమర్పించారు. ఈ నిర్ణయంతో రాజన్నపేట గ్రామస్తుల స్థానిక అభివృద్ధి, సౌకర్యాలు మరింత వేగంగా అందుకునే అవకాశంకల్పించబడింది.గ్రామస్థులు ఈ అవకాశాన్ని స్వాగతించుతూ, స్వతంత్ర పంచాయతీతో గ్రామ ప్రగతి మరింత మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.