logo

కష్టం చెప్పుకోవడానికి వెళ్లిన బాధితులకి పుస్తకాలు, చీరలు కొనిచ్చిన మహారాణిపేట సీఐ

*Today news information*
*విశాఖపట్నం...*
జర్నలిస్టు : మాకోటి మహేష్

*కష్టం చెప్పుకోవడానికి వెళ్లిన బాధితులకి పుస్తకాలు, చీరలు కొనిచ్చిన మహారాణిపేట సీఐ*


ఒక మహిళ బాధను చూసి చలించిన మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్...

మహారాణిపేట దండుబజార్ ఏరియాకి చెందిన జైబూన్ ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి ఉంటున్నారు. బాషా అనే వ్యక్తితో 2007 సంవత్సరంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్ళైన దగ్గర నుండి భర్త చాలా బాధలు పెట్టి ఇంట్లో నుండి పంపించేసారు. ఇద్దరు ఆడపిల్లలు వారిని పోషించడం చాలా కష్టంగా ఉండటంతో, జైబున్ అతికష్టంతో ఇద్దరు ఆడపిల్లలులో పెద్ద పాపను ఇంటర్ మీడియట్ వరకు చిన్న పాపను తొమ్మిదో తరగతి వరకు చదివించింది. ఇంక కష్టాలు భరించలేక వైజాగ్ పోలీస్ కమీషనర్ గార్కి సోమవారం వెళ్లి కష్టం చెప్పుకోగా, సీపీ గారు బాధితులను మహారాణి పేట సీఐ దగ్గరకు పంపించారు. సీఐ దివాకర్ యాదవ్ బాధితుల కష్టాన్ని చూసి, వెంటనే ఇద్దరు పిల్లలకు చదువు కోవడానికి పుస్తకాలు, ట్యూషన్ కి పీజులు, ఇంకా జైభూన్ , వారి తల్లి గార్కి చీరలు కొనిచ్చారు . అలాగే ఇద్దరు పిల్లల చదువుకి కావాల్సిన ఖర్చులు సీఐ గారు చూసుకుంటానని భరోసా ఇచ్చి జైబూన్ భర్త చేసిన అన్యాయానికి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని సీఐ హామీచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ వెళ్లే బాధితులతో కొందరు దురుసుగా ప్రవర్తించే పోలీసులు ఉంటారు ఏమో గాని అందుకు భిన్నంగా భాదితుల కష్టంకి చలించి పిల్లల చదువుకి సహాయం చేసిన మహారాణి పేట సీఐ దివాకర్ యాదవ్ ను విశాఖ ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు....

0
46 views