logo

ముక్కోటి ఏకాదశి: కుటుంబ సభ్యులతో కలిసి చిన్న శ్రీను ప్రత్యేక పూజలు


జామి (అన్నమరాజుపేట): వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు జామి మండలం, అన్నమరాజుపేట గ్రామంలో వెలసిన వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) సందర్శించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.
అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ.. పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

28
18 views