logo

తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఒక మహిళ తన కుమారుడిని అక్రమంగా గంజాయి కేసులో ఇరికించారని ఆరోపిస్తూ దాదాపు గంటసేపు ఆందోళన

*Today news information*

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

*తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఒక మహిళ తన కుమారుడిని అక్రమంగా గంజాయి కేసులో ఇరికించారని ఆరోపిస్తూ దాదాపు గంటసేపు ఆందోళన*
తన కుమారుడు గంజాయి తాగి ఉండొచ్చేమో కానీ, అతను గంజాయి విక్రేత కాదని, పోలీసులు బలవంతంగా గంజాయి ప్యాకెట్లు పెట్టి ఫోటోలు తీసి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.
న్యాయం చేయమని కోరడానికి వెళ్లిన తనను తాడేపల్లి సీఐ (CI) అత్యంత అసభ్య పదజాలంతో దూషించారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదు రోజుల పాటు తన కొడుకును అక్రమంగా నిర్బంధించి, కేసు ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు

ఈ ఆందోళన సమయంలో అక్కడి నుండి వెళ్తున్న ఒక మాజీ కౌన్సిలర్ కాళ్లు పట్టుకుని ఆ మహిళ తన కొడుకును రక్షించాలని ప్రాధేయపడటం అక్కడున్న వారిని కలచివేసింది. అయితే, ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు.
పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో, ఆందోళన చేసిన మహిళపై కూడా కేసు నమోదు చేయాలని సీఐ తన సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం.
*తల్లిదండ్రుల డిమాండ్* : గంజాయి విక్రేతలను పట్టుకోవడంలో తప్పులేదని, కానీ తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేసేలా అక్రమ కేసులు పెట్టవద్దని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు
తాడేపల్లి ప్రాంతంలో గంజాయి నియంత్రణ పేరుతో పోలీసులు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు గతంలోనూ కొన్ని సందర్భాల్లో వచ్చాయి. ఈ తాజా వివాదంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారుల స్పందన రావాల్సి ఉంది.

5
554 views