
252 జీఓ సవరించాలి
- జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
- 252జీఓ అమలు అక్రిడిటేషన్ల 10వేల మందికి ముప్పు
- గంగుల రామ్ గోపాల్
252 జీఓ సవరించాలి
- జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
- 252జీఓ అమలు అక్రిడిటేషన్ల 10వేల మందికి ముప్పు
- టీయుడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్
జగిత్యాల, డిసెంబర్ 27: నూతన అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 252 జీవో కొన్ని నిబంధనలతోరాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందని
టీయుడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర
ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 252 జీవోలో తక్షణమే సవరణ చేయాలని కోరుతూ శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు. ఈ
ప్రజాస్వామ్య విలువలు, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ ప్రభుత్వం నూతన అక్రిడేషన్ల కోసం జీవో జారీ చేయడం అభినందనీయమైన అంశమే అయినప్పటికీ, ఇందులోని కొన్ని నిబంధనలు జర్నలిస్టుల జీవనోపాధికి తీవ్ర ముప్పుగా మారాయని వారు పేర్కొన్నారు.
గతంలో అమలులో ఉన్న జీవో నం.239 ప్రకారం పెద్ద పత్రికలకు 20 మంది కరస్పాండెంట్లు, 20 మంది డెస్క్ జర్నలిస్టులు, 4 మంది కెమెరామెన్లకు అక్రిడిటేషన్లు మంజూరు చేయగా, నూతన జీవో నం.252లో ఈ సంఖ్యను వరుసగా 12, 12, 3కి తగ్గించడం వల్ల అనేక మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోల్పోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలోనూ కోతలు విధించారని విమర్శించారు.జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ మాట్లాడుతూ మీడియం పత్రికలు, శాటిలైట్ ఛానళ్లకు కూడా గణనీయమైన తగ్గింపు విధించడమే కాకుండా, గతంలో కేబుల్ ఛానళ్లకు రాష్ట్ర స్థాయిలో ఐ & పి ఆర్ ద్వారా ఇచ్చే 12 అక్రిడిటేషన్లను పూర్తిగా రద్దు చేయడం ఆందోళనకరమన్నారు. జిల్లా ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్ మాట్లాడుతూ గతంలో ప్రసారాలు జరుగుతున్న కేబుల్ చానల్ కు ప్రతి జిల్లాకు నాలుగు అక్రిడిటేషన్లు మంజూరు చేయగా, ఇప్పుడు ఒక్క జిల్లాకు కేవలం రెండు మాత్రమే ఇవ్వడం వల్ల జర్నలిస్టులపై తీవ్ర ప్రభావం పడనుందని తెలిపారు. నేషనల్ కౌన్సిల్ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంతకుముందు నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు ఇచ్చేవారని, నూతన జీవోలో ఆ విధానాన్ని పూర్తిగా తొలగించడం అన్యాయమని విమర్శించారు. అలాగే ఒక లక్ష జనాభా ఉన్న మండలానికి ఒక అక్రిడిటేషన్, అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే రెండో అక్రిడిటేషన్ ఇచ్చే విధానాన్ని కూడా రద్దు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులను వేరు చేస్తూ ‘మీడియా కార్డు’ పేరిట విభజన తీసుకురావడం జర్నలిస్టు సమాజంలో తీవ్ర చర్చకు, అసంతృప్తికి దారితీస్తోందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ప్రతిష్ఠకు కూడా భంగం కలిగించే అవకాశముందని అభిప్రాయ పడ్డారు.15 వేల కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న చిన్న పత్రికలకు కూడా ఈ జీవో ద్వారా అన్యాయం జరుగుతోందని, గతంలో నియోజక వర్గ స్థాయిలో ఇచ్చే అక్రిడిటేషన్లు పూర్తిగా తొలగించడం వల్ల అనేక మంది జర్నలిస్టులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులు అన్న తేడా లేకుండా అందరినీ అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తిస్తూ, జర్నలిస్టుల హక్కులు, గౌరవం, ఉపాధిని పరిరక్షించేలా జీవో నం.252లో తగిన సవరణలు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. గంగాధర్, కోరుకంటి విజయ్,కోశాధికారులు కటుకం రాజేశ్, గోపిగౌడ్ , ఎండీ సాజిద్, మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లక్కం మల్లేశం, శివకుమార్, పుల్లా శ్రీనివాస్, నవీన్,హరీష్,రత్నాకర్, కటుకం గణేష్,ప్రభాకర్,సంతోష్,ముకేశ్,జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు లు పెద్దఎత్తున పాల్గొన్నారు.