జొన్నలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి:ఏఓ పవన్ కుమార్.
బండి ఆత్మకూరు (AIMA MEDIA ): జొన్న మినుము పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని బండి ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పేర్కొన్నారు. వారు శనివారం మండలంలోని సింగవరం పార్నపల్లి గ్రామాల్లో సాగుచేసిన జొన్న, మినుము పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. జొన్న పంటకు సోకిన కత్తెర పురుగు నివారణకు కొరాజిన మందు 60 ఎం.ఎల్, లేదా బెంజోయేట్ 80 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి ఎకరాకు పిచికారి చేయాలన్నారు.జొన్న పంట 30 రోజుల నుంచి 50 రోజుల వ్యవధిలో ఎకరానికి 20 కిలోల పొటాష్, 50 కిలోల యూరియా వేయాలన్నారు. మినుము పంటకు బూడిద తెగులు సోకిందని, దాని నివారణకు హెక్సాకొనజోల్ లేదా కార్బండిజం 250 గ్రా ఎకరానికి పిచికారి చేయాలని ఏఓ తెలిపారు. రబి వరి సాగు చేసే రైతులు తప్పనిసరిగా వరి పంటలో కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు వ్యవసాయ విస్తరణ పుష్పలత, ప్రియాంక పలువురు రైతులు పాల్గొన్నారు.