వైసీపీ దుష్ప్రచారానికి హోంమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయాలకు వచ్చే భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను, దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.