logo

రైతు సంక్షేమమే ధ్యేయం: కోటసిర్లాంలో రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీ నాయన!


బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం, కోటసిర్లాం గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని శనివారం శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) ప్రారంభించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ, కోటసిర్లాం గ్రామ రైతుల కోసం రైతు సేవా కేంద్రం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కోటసిర్లాం రెవిన్యూ పరిధిలోని అన్ని గ్రామాల రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి చింతల రామకృష్ణ, విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతి, రామభద్రపురం మండలం టీడీపీ అధ్యక్షులు కరణం భాస్కరరావు, విజయనగరం పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు కర్రోతు తిరుపతి, సర్పంచ్ తాడి తిరుపతమ్మ, కనిమెరక శంకర్రావు, సర్పంచ్ ప్రతినిధి తాడి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.

0
12 views