logo

సేవాదళ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే కార్యకర్తలను ఉద్దేశించి సేవాదళ్ క్రమశిక్షణకు మారుపేరు అని అన్నారు

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **చంద్రుగొండ** డిసెంబర్ 27**( ఏఐఎంఏ మీడియా)


*శాసనసభ్యులు జారే ఆదినారాయణ సేవాదళ్ కార్యక్రమంలో మాట్లాడుతూ సేవాదళ్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా,
________________________
తాను సేవాదళ్ కార్యక్రమాల్లో పాల్గొన్న వాడినని ఆ క్రమశిక్షణ పట్టుదల తోనే నేను ఈ స్థాయికి ఎదిగానని ఎమ్మెల్యే జారే అన్నారు ఏ మనిషి అయినా భవిష్యత్తులో తన గోల్ చేరుకోవాలంటే ప్రధమంగా అలవర్చు కోవాల్సింది క్రమ శిక్షణని అన్నారు కాంగ్రెస్ పార్టీలోని సేవా దల్ విభాగం
కాంగ్రెస్ పార్టీకి గుండె లాంటిదని ఎన్నో దశాబ్దాల నుండి కొనసాగుతున్న సేవాదళ్ విభాగం లో ఉన్న నాయకులు చరిత్ర పుటల్లో నిలిచి పోయారని ప్రపంచానికే మార్గదర్శకంగా సేవాదళ్ రూపాంతరం చెందిందని అన్నారు ఇకపై 2026 సంవత్సరం నుండి ప్రతి నెల చివరి ఆదివారం నాడు అశ్వరావుపేట నియోజక వర్గంలోని 101 పంచాయతీల్లో గల కార్యాలయాల్లో సేవ దళ్ తరపున జాతీయ జెండా ఆవిష్కరించాలని ఈ కార్యక్రమంలో పంచాయతీల సర్పంచులు వార్డు మెంబర్లు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొనాలని సూచించారు ఇది వెంటనే అమలులోకి తీసుకురావటానికి తాను పూర్తిగా సహకరిస్తానని అదేవిధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ దిమ్మె నిర్మాణం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవాదళ్ కార్యకర్తలు పని చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు,
ధర్మారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, అంకిరెడ్డి కృష్ణారెడ్డి,
మాలోతు భోజియా నాయక్, తుమ్మలపల్లి సురేష్, కేశ బోయిన నరసింహారావు, ఎండి ఫజల్ బక్షి ,పర్స వెంకట్,మరియు పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారూ...

41
1823 views