logo

కాంగ్రెస్,బిజెపి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూక్యా జాన్సన్ నాయక్ !


ఖానాపూర్ మండలం సింగపూర్ నుండి బీజేపీ నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు వారికి బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ . గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నుండి, ఆకుల పెద్ద రాజన్న, కొట్టే మోహన్, కంటేస్టెడ్ సర్పంచ్ , అడిదెల లింగన్న , మాజీ సర్పంచ్ , బిల్లశంకర్ , కుందరపు శ్రీను , కర్ణాల గంగన్న , కుందరపు శేఖర్, లింగాల నవీన్, కొట్టే నాగేష్, సిద్ధి నవీన్, బిల్ల మనోహర్, ఆకుల వెంకటేష్, గౌండ్ల శ్రీను, కట్ట నాగన్న, కట్ట అశోక్, లావుడ్య మహేందర్, నూనావత్ వినీష్, బనావత్ పరశురామ్, భూక్యా మంగ్య, జెకా మహేందర్ , జైనీ రాజేందర్ సుక్క రాజన్న నూనావత్ భీముడు, కుందరపు లింగన్న, తోట సత్తన్న , అమీర్ ఈ రోజు బీఆర్ఎస్ చేరారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ తుఫాన్ వేగంతో అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ గులాబీ జెండాని అండగా ఉంటుందని కాంగ్రెస్ బిజెపి పార్టీలు తెలంగాణకు చేసింది శూన్యమని. గత పదేళ్ళ పాలనలో తెలంగాణ సాధకులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని గుర్తు చేశారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిననాయకులకు స్వాగతం తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

0
938 views