logo

దేశానికి అవసరం కమర్షియనిస్టులా.. కమ్యూనిస్టులా...?#AIMA Suvarnaganti RaghavaRao Journalist

దేశానికి అవసరం కమర్షియనిస్టులా..
కమ్యూనిస్టులా...?

కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి నష్టమా...!
దేశం వెనక్కి పోతుందా...!! అనే ప్రశ్నలు రావడం ప్రస్తుతం సహజమే.

మనదేశ ప్రస్తుత పరిస్థితిని ఉద్దేశించి 'భారతదేశం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ' సాధిస్తామని ప్రభుత్వం అంటుంది. కోవిడ్ నుంచి 2025 నాటికి జీడీపీ 6.5% ఉండగా, 2025-26 నాటికి 7.8% (తొలి 3నెలలలో) జీడీపీ బలమైంది, తగ్గుతున్న ద్రవ్యోల్బణం. 2038 నాటికి పీపీపీ విధానంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని అంచనాను ఐఎంఎఫ్ ప్రకటించినది. మనం సంతోషించాల్సిందే.

దేశంలోనూ, రాష్ట్రంలోనూ సామాన్యుడి జేబులో మాత్రం నోట్లు కనిపించడం లేదు. బజార్ లో కేజీ బియ్యం, వంటనూనె, పాలు, గ్యాస్ సిలిండర్ రేట్లు, రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయనే ఆర్థిక బాధలు, ప్రజల నుండి వస్తున్న అభిప్రాయాలు.
మరోప్రక్క కోట్ల రూపాయల లాభాలు గడించే కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాననే ఎన్నికల హామీ అలాగే ఉంది. మధ్య తరగతికి, క్రింది దిగువ తరగతికి ఉద్యోగ భద్రత లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ దూరమవుతున్న పరిస్థితి ఉంది.

*జీడీపీ పెరిగిందని గర్వపడే వాళ్ళకి సామాన్య యువకుడి ఈఎంఐ బాధలు కనిపిస్తున్నదా..!*

నెలాఖరున ఈఎంఐ కట్టలేక ఇబ్బందిపడే సామాన్య యువకుడి బాధ కనిపిస్తున్నదా...!
బ్రతుకుతెరువుకోసం రాష్ట్రాలు దాటాలి, బంధాలను దాటాలి, కష్టాలను దాటాలి, దీంతో ప్రారంభం అవుతుంది జీవనం. ఇంటి అద్దెల భారం, ఇంటికి పని ప్రదేశానికి దూరం, పిల్లల చదువులకు ఫీజులు భారం, తల్లితండ్రులకు నెలనెలా సారం, వీకెండ్స్ ఖర్చులు ఘోరం, ఊర్లో పుట్టింటి వారితో మాట్లాడాలనిపిస్తే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ దూరం, మానసిక ఉల్లాసానికి ఆమడ దూరం, ఇదే కదా సామాన్యుడి ఈఎంఐ ల భారం.

*మన అసమానత దేశంలో సంపద కొందరికే కేంద్రీకృతం*
ప్రభుత్వ పరిపాలనంతా ప్రైవేటేజేషన్, కార్పొరేటైజేషన్
టాక్స్, కట్టింగ్స్.

ఈసీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు ప్రభుత్వం మల్లుతుంటే, ఈసీ ఆఫ్ లివింగ్ సామాన్య ప్రజలకు కష్టమవుతుంది.

ఆరోగ్యం, విద్యా, ఇల్లు, ఉద్యోగం, ఇవన్నీ బజార్ లో కొనే వస్తువులులా మారిపోతున్నాయని ప్రజల్లో ఫీలింగ్ పెరుగుతుంది.

*అభివృద్ధి అంటే, బిలియనీర్ల సంఖ్య పెరగటమా.. లేక పేదల కడుపు నిండడమా...!*
వీరంతా కమర్షియనిస్టులు కాదా..!

*కమ్యూనిస్టులు ఏం చెబుతారు..?*
- అసమానతలు పోవాలి.
- కార్మిక హక్కులు రక్షించాలి.
- సంపద పంచుకోవాలి.
- పబ్లిక్ సెక్టర్ బలోపేతం చేయాలి.
- ఆరోగ్యం, విద్యా, నీరు, విద్యుత్ ని హక్కులుగా చూడాలి.
(ఈ నినాదాలు పై మరో కథనం రాద్దాం).

కానీ ఈరోజు దేశంలో పెరుగుతున్న అసమానతలకు కారణం, పెట్టుబడుదారుల దోపిడీ కాదా..! క్యాపిటలిజం ఉన్మాదానికి బ్రేకులు వేయాలి కదా..!!

వేయకపోతే మన భారతదేశంలో కార్పొరేట్
మోనోపోలీలు, రియల్ ఎస్టేట్ బూమ్ లు వంటి వాటితో ఉన్మాదంతో నష్టంలో కూరుకుపోమా..!!!
ఉదాహరణ: అమెరికాలో 2008లో ఆర్థిక సంక్షోభం కూడా దీని ఫలితమే కదా.

*కాపిటలిజం ఉన్మాదానికి వర్గ పోరాటం తప్పదు*
కమ్యూనిస్టులు లేకపోతే, ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ ఏది. ప్రైవేటుకు అమ్మేటప్పుడు వీటిని కాపాడటానికి, ఎవరు గొంతు వినపడుతుంది.?

*కమ్యూనిస్టులు బలహీనులయ్యారు. -కమ్యూనిస్టులు ఎక్కడున్నారు.* (ఈ ప్రశ్నలతో పాటు కొన్ని విమర్శలు ఉన్నాయి. అంగీకరించక తప్పదనిపిస్తుంది.)
- కమ్యూనిస్టులు ప్రజల సమస్యలను ఎప్పుడు ప్రస్తావిస్తారు.
- కానీ ఉమ్మడి ప్రయోజనాలు పోయి, వ్యక్తిగత ప్రయోజనాలు కొందరిలో వచ్చాయి.
- ఊహజనితులుగా మారారని.
- మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేదని.
- సుజనాత్మకత లేకపోవడం, కొందరిలో నిజాయితీ లేకపోవడం.
- సహకారం అందించే వారిని, ప్రోత్సాహించకపోవడం.
- వారికి నచ్చిన వారికి ప్రాధాన్యతను ఇవ్వటం.
- లోపాలను సరి చేసుకోకుండా, పెరుగుదలకు మార్గం చూడకుండా, వెనక పడ్డారనే ఆరోపణ ఉంది.
- పార్టీలు అంతర్గతంగా పాత పద్ధతుల్లోనే నడుస్తున్నాయని విమర్శ కూడా ఉంది.
- కానీ విమర్శల పేరుతో వర్గ పోరాటాన్ని, రాజకీయాన్ని పూర్తిగా డిస్మిస్ చేయాలని ప్రయత్నించే శక్తులు, ఈరోజు ఆర్థికంగా లాభాపడుతున్న తరగతులవే, అనేది గుర్తించుకోవాలి.

(భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కామ్రేడ్స్ అందరికీ డిసెంబర్ 26 వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.)

*కమ్యూనిస్టులు మారాలి... ఒకే*
మారాల్సింది కేవలం వాళ్లేనా..!
వారిపై విమర్శించే క్యాపిటలిస్టులు, రాజకీయ పార్టీలు మారవా...!!
ప్రజల కోసం ప్రాణం పెట్టి పోరాడేదెవరూ...?

*కమ్యూనిస్టులు అవసరమా...? కాదనేది అసలు ప్రశ్న*
ఈరోజు కార్పొరేట్ ఆధిపత్యానికి, పెరుగుతున్న అసమానతలకు, ఉద్యోగులు, ఐటీలకు భద్రత, భర్తీకి, రైతులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలకు గట్టి స్వరమవసరం.

ఆ స్వరం మన ఎడమ (లెఫ్ట్) రాజకీయాల్లో ఉంది.
- ఆ స్వరాన్ని కమ్యూనిస్టులు భర్తీ చేస్తారా...
- కొత్త తరహా శక్తులు వస్తాయా...
- అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

*కానీ ఎడమ(లెఫ్ట్)వైపు ఆలోచన మాత్రం దేశానికి అవసరమే.*
దేశ సంపద ఎవరు చేతుల్లో ఉండాలి? దేశ విధానం ఎవరికి అనుకూలంగా ఉండాలి?
రైల్వే, ఎయిర్ పోర్ట్ లు - ప్రైవేటైజేషన్,
కాంట్రాక్ట్ జాబులు - పెర్మనెంట్ జాబులు ప్రైవేటైజేషన్,
స్కూల్స్ - కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్.

*మీరు ఏ తరగతిలో ఉన్నారో..మీ జేబులో ఎంత ఉంది, అనేది మీ ఓటు నిర్ణయించాలి.*

- ఇప్పుడు మీరే నిర్ణయించండి,
- దేశానికి కమ్యూనిస్టులు అవసరమా... కాదా..?

ఆర్థిక వాస్తవాల కోణంలో భారత ఎకానమీ - కమ్యూనిజం:
మీరు ఎవరి పక్షంలో ఉంటారో ఆలోచించండి.

సువర్ణగంటి రాఘవరావు
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
అక్షర సంకేతం
9490883004.

4
542 views