logo

జగన్ పాలనలో తిరుమలలో మహాపాపాలు: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి


గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు, మహాపాపాలు జరిగాయని రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం హిందువులందరినీ కలిచివేసిందని, భక్తుల సౌకర్యాలను గత ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి పాత్రతో సహా అప్పట్లో జరిగిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ప్రస్తుతం ఈ అంశాలు న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

0
66 views