logo

"త్యాగం, సమర్పణ లేని క్రైస్తవ జీవితం వ్యర్థం: ఘనంగా మరనాత విశ్వాస సమాజం క్రిస్మస్ వేడుకలు"


విజయ నగరం: ప్రపంచ దేశాలన్నీ జరుపుకునే పండుగ క్రిస్మస్ అని క్రిస్మస్ ఒక మహాద్భుతం అని రెవ : బి ఎం రాజు అన్నారు. స్థానిక మరనాత విశ్వాస సమాజం ప్రార్ధనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన పుట్టుక ఎంతో మేలు, దీవెన తీసుకువచ్చింది.... దేవుని స్వరూపం కలిగి దేవుడు తో సమానంగా ఉండుట భాగ్యం కాదని నీకు నాకు రక్షణ కోసం జన్మించాడు.... సమర్పణ , త్యాగం లేని క్రైస్తవ జీవితం వ్యర్థం.... క్రీస్తు ఏసునకు కలిగి మనస్సు కలిగి ఉండాలి....అంతటి భాగ్యాన్ని వదలి ఆయన వస్తే నీ పాపాలు నువ్వు వదలదడం లేదు...విడిచి పెట్ట వలసినవి విడిచిపెట్టక పోతే ఎన్ని క్రిస్మస్ లు చేసుకున్న వ్యర్ధమే...నిన్ను నన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన జన్మించాడు... అలాగే చిన్నారులు క్రిస్మస్ గీతాలకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్వయర్ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.అలాగే కేండల్ సర్వీసు చేశారు.

4
108 views