logo

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కలిసిన ఆర్ఎంపి పిఎంపీలు

AIMA న్యూస్ అమరావతి :
ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ ఏక్షన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో బుధవారం అమరావతి ముఖ్యమంత్రి కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల గుర్తింపు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సమస్య తమ దృష్టిలో ఉందని త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీఆర్ జేఏసీ చైర్మైన్ డా.కేజీ గోవిందరెడ్డి, న్యాయ సలహాదారు డాక్టర్ ఎన్ఎల్ రావు, రాజకీయ సలహాదారు లంకదాసరి ప్రసాదరావు, రాష్ట్ర నాయకులు టి రాజా సిద్ధార్ధ, వీబీటీ రాజు, జీఎస్ ప్రసాద్, కంబాల బాబూరావు,యామర్తి నాగేశ్వరరావు, కరెళ్ళ గణపతి, ఎమ్ ఎన్ రాజు, ఉమాశంకర్,సీఎస్ కుమార్, బళ్ళా శ్రీనివాసరావు, ఎన్ సుగుణేశ్వరి,వి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

51
6709 views