logo

అదనపు ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసిన ఏ ఈ హుస్సేన్ భాష

ఆళ్లగడ్డ: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు ఉయ్యాలవాడ లోని తెలుగుపేట మరియు ఎస్సీ కాలనీలో రెండు 100 కెవిఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని విద్యుత్ ఏఈ హుస్సేన్ భాష తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద 3 కిలోవాట్ సోలార్ పలకలు బిగించుకున్న వారికి ప్రభుత్వం 78 వేల వరకు సబ్సిడీ అందజేస్తుందని చెప్పారు కాబట్టి వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా తెలిపారు.

10
256 views