logo

ఘనంగా 'సఫోజ్ గ్రాండ్ క్రిస్మస్ సంబరాలు.. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్ఎండి ఫయాజ్.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలోని 38 వార్డ్ వై.ఎస్.ఆర్ నగర్‌లో తాటికొండ బుగ్గ రాముడు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 'సఫోజ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు' అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎన్ఎండి. ఫయాజ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే యేసుక్రీస్తు కేవలం ఒక్క మతానికే పరిమితం కాదని, ఆయన మానవాళి మొత్తానికి మార్గదర్శి. సమాజంలో ద్వేషాన్ని వీడి, ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన బోధించారని. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, తోటి మనిషిని ప్రేమించడమే నిజమైన భక్తి" అని ఫయాజ్ అన్నారు. నంద్యాల గడ్డ ఎప్పుడూ మత సామరస్యానికి నిలయమని, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదరభావంతో మెలుగుతారని ఆయన కొనియాడారు. ఇలాంటి పండుగలు మన మధ్య ఉన్న బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, విభజన రాజకీయాలకు తావులేకుండా అందరూ అభివృద్ధి పథంలో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ భారీ క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేసిన తాటికొండ బుగ్గరాముడు (యేసుదాసు) ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల కోసం పోరాడుతూనే, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడం సంతోషకరమని పేర్కొన్నారు. పేదలకు, అణగారిన వర్గాలకు అండగా నిలవడమే క్రిస్మస్ పండుగ యొక్క అసలైన పరమార్థమని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు తాటికొండ బుగ్గ రాముడు ( యేసుదాసు) మాట్లాడుతూ ప్రతి ఇంటా క్రిస్మస్ వెలుగులు నిండాలని ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప దైవం యేసుక్రీస్తు అని. ఆయన చూపిన ప్రేమ, కరుణ, సహనం అనే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. నంద్యాల పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఈ క్రిస్మస్ వేడుకలు ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఈ వేడుకలకు కేవలం ఒక వర్గానికో, పార్టీకో పరిమితం కాకుండా, పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలను, రాజకీయ నాయకులను మరియు ఆత్మీయులను సాదరంగా ఆహ్వానించమన్నారు . వై.ఎస్.ఆర్ నగర్‌లోని నా నివాసం వద్ద జరిగిన ఈ భారీ బహిరంగ సభలో దైవజనులు ఇచ్చే దైవ సందేశం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక మార్పు తీసుకువస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ సభను జయప్రదం చేయడానికి తరలివచ్చిన నాయకులకు, పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ రెవరెండ్ జి. పెద్ద సోమ్లా నాయక్, పి.పాల్ కిషోర్ , కన్వీనర్ డి.పాల్ జోసెఫ్ దైవ సందేశాన్ని అందించారు అనంతరం నిర్వాహకుడు తాటికొండ బుగ్గ రాముడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పాస్టర్లకు నూతన వస్త్రాలు, మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం తాటికొండ మహేష్ బాబు,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, సాయిరాం, కృపాకర్ ,జార్జ్, మిద్దె హుస్సేన్, నందం బాబురావు, గోవింద్ నాయుడు, నాగేశ్వరావు, ప్రసాద్ రెడ్డి, షాకీర్ మరియు పాస్టర్లు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

5
546 views