logo

పోలీసుల 'శ్రమదానం'.. పార్కుకు కొత్త కళ: సామాజిక బాధ్యతను చాటుకున్న విజయనగరం జిల్లా పోలీసులు


ఎ.ఆర్.దామోదర్ వారి ఆదేశాల మేరకు మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, సిఐ ఈ.నర్సింహామూర్తి, ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసికట్టుగా పట్టణంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్ దగ్గర బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి పార్కును ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దారు.
వివరాల్లోకి వెళితే – విజయనగరం పట్టణంలో ఎంప్లాయిమెంట్ ఆఫీస్ దగ్గర బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి పార్కులో నిత్యం వృద్ధులు, మహిళలు, ప్రజలు వాకింగ్ మరియు జాగింగ్ చేస్తూ, అక్కడ సేదతీరుతూ ఉంటారు. అయితే ఈ పార్కును చాలా రోజుల నుండి ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడ వాకింగ్ మరియు జాగింగ్ చేస్తున్న వృద్ధులు, మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రులు లైటింగ్ లేక అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఈ రోజు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వారి ఆదేశాల మేరకు సామాజిక బాధ్యత మరియు ప్రజల రక్షణలో భాగంగా మహిళా పోలీసు స్టేషన్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, సిఐ ఈ.నర్సింహామూర్తి, ఎస్ఐలు మరియు సిబ్బంది కలిసికట్టుగా స్వయంగా శ్రమదానం చేసి, పార్కులో ఉన్న చెత్తను తుడిచి, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలను కట్ చేసి, రంగులు వేసి, అక్కడ ఉన్న అబ్దుల్ కలాం విగ్రహాన్ని నీటితో కడిగి శుభ్రపరిచారు. అనంతరం పార్కులో వాకింగ్ చేసిన తర్వాత ప్రజలు కూర్చునే విధంగా నాలుగు సిమెంట్ బల్లలు, పార్కులో సరిపడా లైటింగ్ కూడా ఏర్పాటు చేసి పార్కును సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.
ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం చేపట్టడంతో చుట్టపక్కల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నర్సింహా మూర్తి, ఎస్సైలు, సిబ్బంది మరియు స్థానిక వాకర్స్ పాల్గొన్నారు.

0
0 views