logo

ఘనంగా జననేత జగనన్న జన్మదిన వేడుకలు.

నంద్యాల (శుభోదయం న్యూస్): నంద్యాలలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసిపి నేతలు, కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం, ఐ బ్యాంకు ను ఏర్పాటు చేశారు వైసీపీ అభిమానులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ మాట్లాడుతూ... జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం రాష్ట్ర ప్రజలకు పండుగ దినం అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక జనహిత సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో కొలువైన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం ప్రతి ఇంటిలోని పేద, బడుగు వర్గాలకు పండుగ దినంగా భావించి సంతోషంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాలలో రక్తదాన శిబిరాలు, ఐ బ్యాంక్, ఏర్పాటు చేయడం తో కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగనన్న అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి దేశం సుధాకర్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కల్లూరు రామలింగారెడ్డి రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మాబన్నిసా, వైసిపి సీనియర్ నాయకులు ప్రహ్లాద రెడ్డి, రామ సుబ్బారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ శేఖర్ రెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు మరియు అసెంబ్లీ కమిటీ సభ్యులు కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జిలు వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

0
0 views