పార్వతీపురంలో అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహానికి శంకుస్థాపన
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎన్డీఏ ఆధ్వర్యంలో అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు ప్రతి జిల్లా కేంద్రంలో దివంగత వాజ్ పేయ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 25న ఆయన జయంతి. మన్యం పార్వతిపురం జిల్లా కేంద్రం పార్వతీపురం లో బెలగాం తాహాసిల్దార్ ఆఫీస్ వద్ద ఆయన విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు డాక్టర్ హేమ నాయక్ , బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు రెడ్డి సింహాచలం, సాలూరు జనరల్ సెక్రెటరీ గొర్లె భాను , మన్యం జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వరరావు భారతీయ జనతా పార్టీ ఇతర కూటమి కార్యకర్తలు అటల్ బిహారీ వాజ్పేయి అభిమానులు పాల్గొన్నారు.