logo

హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో అంతర్జాతీయ తొలి ధ్యాన దినోత్సవం నిర్వహణ


అనకాపల్లి పట్టణంలోని స్థానిక వుడ్‌పేట హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో అంతర్జాతీయ తొలి ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని, స్కూల్ కరస్పాండెంట్ గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులు ముందస్తుగా ధ్యాన దినోత్సవాన్ని ధ్యానమయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిట్టి పొట్టి చిన్నారులంతా ఎంతో ఉత్సాహంతో ధ్యానం చేయగా, కార్యక్రమం ప్రశాంతతతో నిండిపోయింది. ధ్యానం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని కరస్పాండెంట్ గిరీష్ కుమార్ తెలిపారు. దీని ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిందని ఆయన వివరించారు.
ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని, రోజువారీ జీవితంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించడంలో ధ్యానం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే ధ్యానం అలవాటు చేసుకుంటే వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సునీత, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, విశ్రాంత నీటిపారుదల శాఖ ఏఈ మల్ల చిన్నారావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

5
25 views