logo

వృద్ధుడి కండరాలను కొరుక్కు తిన్న సునకం..

జర్నలిస్టు : మాకోటి మహేష్
తంబళ్లపల్లి మండలానికి చెందిన ఓ వృద్ధుడి కాండరాలను ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కొరుక్కు తినడం తీవ్ర కలకలం రేపింది. ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కోసువారిపల్లి గ్రామం, కొప్పల వారి పల్లికి చెందిన రెడ్డప్ప (75) ఆరోగ్య సమస్యల కారణంగా మంచానికి పరిమితం అయ్యాడు. ఇంట్లో ఉన్న రెడ్డప్పను పెంపుడు కుక్క కాళ్లు చేతులకు ఉన్న కండరాలను కొరుక్కు తినేసింది. మాట్లాడలేని స్థితిలో ఉన్న బాధితుడిని గుర్తించిన కుటుంబీకులు వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

0
0 views