logo

అక్కివరం పంచాయతీలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్

AIMA న్యూస్ శ్రీకాకుళం :
*ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలే* *ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే* *కూన రవికుమార్*

👉ఆమదాలవలస నియోజకవర్గం, ఆమదాలవలస మండలం అక్కివరం పంచాయతీ పరిధిలో రూ.10 లక్షల NHM (నేషనల్ హెల్త్ మిషన్) గ్రాంట్ నిధులతో నిర్మించిన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ (HWC – విలేజ్ క్లినిక్) ను గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు గురువారం ఘనంగా ప్రారంభించారు.

👉ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విలేజ్ క్లినిక్‌ల ద్వారా సాధారణ ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ, మాతృ–శిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు వంటి సేవలు ప్రజలకు దగ్గరలోనే అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

👉అక్కివరం గ్రామ ప్రజలు ఇకపై చిన్నపాటి ఆరోగ్య సమస్యల కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే వైద్య సేవలు పొందగలుగుతారని ఆయన అన్నారు. ఈ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

👉ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0
24 views