logo

డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్

AIMA న్యూస్ శ్రీకాకుళం :
*▪️‘SAY NO TO DRUGS’ నినాదంతో పోలీస్ సోదరులు చేస్తున్న సైకిల్ యాత్రలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు...*

*▪️మాదక ద్రవ్యాలపై పోరాటంలో యువత భాగస్వాములు కావాలి – ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు పిలుపు...*

*▪️ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైకిల్ యాత్ర నిర్వహించింది.“జీవితం చాలా విలువైనది… డ్రగ్స్ బారిన పడకండి – SAY NO TO DRUGS” అనే నినాదంతో సాగిన ఈ యాత్రలో దారి పొడుగునా విద్యార్థులు, యువత పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు మాట్లాడుతూ,మాదక ద్రవ్యాలు వ్యక్తిని కాదు, కుటుంబాన్ని కాదు, సమాజాన్నే నాశనం చేస్తాయని,ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సైకిల్ ర్యాలీ పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం వద్దకు చేరుకున్న సందర్భంగా, గౌరవ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు ర్యాలీని ఘనంగా స్వాగతించి డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు,పాల్గొన్నారు.*

0
66 views