logo

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

శ్రీకాకుళం:మునసబుపేట గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొక రికి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోటబొమ్మాళి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన కమిల్లి భాస్కరరావు (60), ఆనపాన గణేష్‌(27) ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. బైక్‌ వెనుక కూర్చున్న భాస్కరరావు తుల్లిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న గణేష్‌ తీవ్రంగా గాయపడగా..చికిత్స నిమిత్తం రిమ్స్‌కి తరలించారు. భాస్కరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ కె.రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0
0 views