logo

చోరీ కేసులో నలుగురి అరెస్టు

శ్రీకాకుళం:పలాస మండలం రామకృష్ణాపురం గ్రామం సమీపంలో ఉన్న సత్యసాయి విద్యావాహార్‌కు చెందిన రూ.1.40 లక్షల విలువైన ఐరన్‌ స్తంభాలు నాలుగు రోజుల కిందట చోరీకి గురయ్యాయి. దీనిపై సంస్థ చైర్మన్‌ మల్లా రామేశ్వరరావు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా.. చోరీకి పాల్పడిన నలుగురిని శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్‌ విధించారు. వారిని పాతపట్నం సబ్‌జైలుకు తరలించారు. మాకనపల్లి గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని ప్రశ్నించగా దొంగతనం చేసిన విషయం బయటపడింది. చోరీకి గురైన ఐరన్‌ స్తంభాలతో పాటు తరలించడానికి ఉపయోగించిన వాహనాన్ని సీజ్‌ చేసినట్టు సీఐ తెలిపారు.

0
0 views