logo

పూడిమడక సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ నీలి తిమింగలం


సముద్ర జీవులు మృత్యువాతపడి తీరానికి కొట్టుకొచ్చే సందర్భాలు చాలానే ఉంటాయి.. సముద్రంలో జీవించే వివిధ రకాల ప్రాణాలు వీడిచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన సందర్భాలు అనేకం.. అయితే, కొన్నిసార్లు అరుదైన చేపలు,తిమింగలాలు కూడా తీరానికి కొట్టుకుస్తుంటాయి.. ఈరోజు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది.. సుమారు 30 అడుగులు పొడువైన బ్లూ వేల్.. దాదాపు 10 టన్నుల వరకు బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఇవి బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని.. సముద్రంలో మరీ లోతుకు వెళ్లి మృత్యువాత పడడంతో.. ఆ తర్వాత తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.

1
452 views