రైలు నుంచి జారిపడి మన్యం జిల్లా దంపతుల మృతి: పెళ్లైన రెండు నెలలకే నూరేళ్లు నిండాయి!
పెళ్లి అయిన 2 నెలలకే నవ దంపతులు మృత్యు వాత పడ్డారు. పార్వతీపురం మన్యం (జిల్లా) గరుగుబిల్లి (మండలం)కి చెందిన కోరాడ సింహాచలం (25), భవాని (19)కి 2 నెలల క్రితం పెళ్లి అయింది. సింహాచలం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న భార్యా భర్తలిద్దరూ విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైలు ఎక్కారు. డోర్ వద్ద నిల్చున్న ఇద్దరూ భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద జారిపడి మృతి చెందారు.