
రాంగ్‌రూట్‌లో వస్తే బండి సీజ్.. తెలంగాణలో 'అరైవ్.. అలైవ్' స్పెషల్ డ్రైవ్*
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
తెలంగాణలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు
రాష్ట్రంలో రోజూ సగటున 20 మంది మృతి
'అరైవ్.. అలైవ్' పేరుతో పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
హైవేలపై రాంగ్ రూట్‌లో వస్తే వాహనం అక్కడికక్కడే సీజ్
తెలంగాణలో రహదారి భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 74 ప్రమాదాలు జరుగుతుండగా, సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతేడాది రోజుకు సగటున 52 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 72 వేలకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ ప్రమాద ఘంటికల నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కేవలం జరిమానాలతో మార్పు సాధ్యం కాదని భావించి, నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అరైవ్.. అలైవ్’ (Arrive.. Alive) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగ