logo

నార్నూర్: నాణ్యమైన విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ – ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. నార్నూర్ మండల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన, రికార్డులను పరిశీలించి బోధనా విధానాలు, విద్యార్థుల హాజరు, వసతులపై లోతైన సమీక్ష నిర్వహించారు. విద్యలో నాణ్యతే ప్రమాణంగా ఉండాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఎక్కడా లోటు లేకుండా కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

6
588 views