logo

రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు పిన్నాపురం ఉపాధ్యాయుడు.

పాణ్యం (AIMA MEDIA): రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు పాణ్యం మండలం తిమ్మాపురం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సుమీయోన్ ఎంపికైనట్లు ఎంఈఓ కోటయ్య తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ నంద్యాల ఎస్పిజి హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి జిల్లా సైన్స్ ఫేర్ ఉపాధ్యాయుల విభాగం పోటీలలో పిన్నాపురం జడ్పీ హైస్కూల్ హెచ్ ఎం సుమియోన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.డిసెంబర్ 23, 24 తేదీలలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఉపాధ్యాయుడు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుమియోన్ ను డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎంఈఓలు కోటయ్య, సుబ్రమణ్యం2, ఉపాధ్యాయ సంఘాలు అభినందించారు.

0
99 views