పాపని ఎత్తుకొని జో కోట్టిన డిసిపి సరిత విజయవాడ
జర్నలిస్టు : మాకోటి మహేష్
ఆంధ్ర ప్రదేశ్ :ఏం చిట్టి తల్లీపాప.. ఏం కావాలి,నేమ్ ప్లేట్ కావాలా,నా పేరు dcp సరిత.పెద్దయిన తర్వాత నువ్వూ ఐపీఎస్ అవుతావా,ఖాకీ డ్రెస్ వేసుకుంటావా, చెప్పు నాన్నా.అంటూ విజయవాడ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ సరిత ఏడుస్తున్న పాప ని చేతుల్లోకి తీసుకుని జోకొట్టారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్న ముఠా పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. అక్కడే ఉన్న ఊయలలో ఏడుస్తున్న ఓ పాప ని చేతుల్లోకి తీసుకున్న సరిత అమ్మలా లాలించారు. ఏడుపు మానిపించేందుకు కొద్దిసేపు ఎత్తుకుని ముద్దుచేశారు. ఈ ఆ పాప ను డీసీపీ సరిత నేమ్ ప్లేట్ను వదలకుండా ఇలా పట్టుకుంది.