సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎస్టీ కమిషన్ మెంబర్ సాయిరాం
గిరి గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ఎస్టీ కమిషన్ ప్రథమ ప్రాధాన్యం అని కమిషన్ సభ్యుడు కిలో సాయిరాం పేర్కొన్నారు. గురువారం డుంబ్రిగుడ మండలం, పోతింగి పంచాయతీ, బీజుమరవలస గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మేరకు బీజుమరవలస ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేవని, గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాలంటూ గ్రామస్తులు ఎస్టీ కమిషన్ మెంబర్ కు వినతి అందించారు. సాయిరాం స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.