logo

ఈ రోజు హిందూపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ కార్యాలయం లో చైర్మన్ DE రమేష్ గారిని కలిసి హిందూపురం

ఈ రోజు హిందూపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ కార్యాలయం లో చైర్మన్ DE రమేష్ గారిని కలిసి హిందూపురం జిల్లా కోసం అత్యవసర మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి హిందూపురం జిల్లా చెయ్యాలని తీర్మానం చేయాలని అలాగే రేపు జరగబోయే ర్యాలీ లో పాల్గొనాలని అక్కడ జిల్లా కు మద్దతుగా మాట్లాడాలని అలాగే ప్రతిపక్షం లో ఉన్నప్పుడు MLA బాలకృష్ణ గారు జిల్లా కోసం పోరాడారు ఇప్పుడు TDP ప్రభుత్వమే ఉన్నది కావున MLA గారు హిందూపురం ప్రజల ఆకాంక్షను CM గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లా సాధించే విషయాన్ని MLA బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం ఇచ్చాం ,ఈ సందర్భంగా చైర్మన్ DE రమేష్ గారు మాట్లాడుతూ జిల్లా కోసం మేము చేస్తున్న ప్రయత్నం కు అభినందనలు తెలియజేస్తూ జిల్లా కోసం కౌన్సిల్ ఏర్పాటు విషయాన్ని MLA గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు అలాగే కమిటీ సభ్యులు ఇచ్చిన సలహాలు సూచనలు అభ్యర్థనలు MLA గారి దృష్టికి తీసుకు వెళ్లి జిల్లా సాధించే విషయం లో మాకు సంపూర్ణ మద్దతుఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు బాలాజీ మనోహర్, అధ్యక్షులు ఇందాద్, కార్యదర్శి నూర్ మహమ్మద్, గౌరవ సలహాదారులు ఉమర్ ఫరూక్, సోమశేఖర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి జమీల్ ఉపాధ్యక్షులు బాబావాలి, అమానుల్లా కార్యదర్శులు K.B.శంకరయ్య, విద్యార్థి నాయకులు కదరిష్, అతిక్, నరసింహమూర్తి, NSUI భారత్ చంద్ర, MIM ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

0
322 views