logo

మల్లికార్జున స్వామి సట్టి జాతర ఉత్సవాలు

అల్లాదుర్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో రెండవ కొమరవెల్లిగా ప్రసిద్ధిగాంచిన మల్లికార్జున స్వామి దేవస్థానంలో స ట్టి ఉత్సవాలు ఆఖరివారంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, మరియు శివసత్తులు, జోగిని లు మల్లికార్జున స్వామి కి బండారు ఎక్కించడం. మరి వృక్షం కింద మల్లన్న స్వామి పటం తొక్కడంతో కనుల విందుగా భక్తుల కోలాహలాలలో అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరిగాయి. నూతన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బచ్చలి హరికృష్ణ మల్లికార్జున స్వామి దేవస్థానం వరకు తాత్కాలిక దారి మరమ్మత్తులు చేయించారు మరియు స్వామివారికి నైవేద్యంగా కడాయి వేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మెంబర్లు నూతన సర్పంచికి కండువాత సన్మానం చేశారు.

0
99 views