గోరంట్ల గ్రామ ఉపసర్పంచ్ గా హాలియా
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామ ఉపసర్పంచిగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరో వార్డు మెంబర్ తాళ్లపల్లి హాలియా ను వార్డు మెంబర్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హాలియా మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఉప సర్పంచ్ గా ఎన్నుకున్న వార్డు మెంబర్లకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి అన్నారు.