తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక 'అమరజీవి' పొట్టి శ్రీరాములు
పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా విజయనగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు. వారు మాట్లాడుతూ.. తన ఆశయ సాధనలో ప్రాణాలను అర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా నిలిచారని పేర్కొన్నారు.