దేశ సేవలో 'విజయనగరం' తేజం.. ఐఏఎఫ్ ఆఫీసర్‌గా తేజేశ్
భారత వైమానిక దళంలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాలకు చెందిన 244 మంది ఫ్లెట్ క్యాడెట్లు శిక్షణ విజయవంతంగా పూర్తయింది. శిక్షణ అనంతరం వారు ఆఫీసర్లుగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్నారు.
ఈ ఆఫీసర్లలో విజయనగరం జిల్లా వసంత విహార్, పద్మావతి నగర్‌కు చెందిన కసిరెడ్డి తేజేశ్ కూడా ఉన్నారు.
తేజేశ్ శిక్షణ పూర్తి చేసుకుని భారత వైమానిక దళంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఆయన తండ్రి శివన్నారాయణ తెలిపారు.