logo

దాసరి శ్రీనివాస్ రావు (కోర్టు గుమస్తా) అకాల మృతి *ఆయన పార్దివదేహానికి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు, బంధువులు, ప్రజలు

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** డిసెంబర్ 14**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


దాసరి శ్రీనివాస్‌కు ఘన నివాళులు అర్పించిన దాసరి కుటుంబ సభ్యులు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 14. డిసెంబర్ ( నవ జన జ్యోతి దినపత్రిక జిల్ల స్టాఫ్ రిపోర్టర్ దాసరి సాంబశివరావు)



కొత్తగూడెం కేంద్రంలో29వ వార్డు, సన్యాస్ బస్తీ

ఈరోజు(ఆదివారం) ఉదయం సన్యాస్ బస్తీ నివాసి, కోర్టు గుమస్తాగా ఎన్నో సంవత్సరాల పాటు నిబద్ధతతో సేవలందించిన దాసరి శ్రీనివాస రావు అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియగానే దాసరి కుటుంబ సభ్యులు, పుర ప్రముఖులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి, విషాదంలో మునిగిపోయారు.

శ్రీనివాస్ మృతికి సంతాపంగా దాసరి కుటుంబ సభ్యులు అందరూ కలసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ స్థానిక ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన పార్దివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తమ సంతాపాన్ని తెలియజేశారు.
అంత్యక్రియల కార్యక్రమాలు కుటుంబ సంప్రదాయానుసారం నిర్వహించబడి, బంధువులు, ప్రజలు, రాజకీయ నాయకుల సమక్షంలో ప్రసాద వితరణతో కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది. శ్రీనివాస్ అకాల మృతితో ఈ ప్రాంతంలో తీరని లోటుగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.

190
4413 views