logo

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా మల్లెల సీతమ్మ నియామకం – ఎమ్మెల్యే తాతయ్య అభినందనలు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిసెంబర్ 13 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా జగ్గయ్యపేట పట్టణం విలియం పేటకు చెందిన మల్లెల సీతమ్మ (W/O మల్లెల కొండయ్య) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) జగ్గయ్యపేట పట్టణంలోని తన నివాసంలో మల్లెల సీతమ్మ ను కుటుంబ సభ్యులు మరియు వార్డు సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లెల సీతమ్మ ను అభినందించి, ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ నకిరకంటి వెంకట్, ఏలూరు గోపాలరావు,గుత్తికొండ శ్రీనివాసరావు, కర్ల జోజి, మారేపల్లి భాష, గింజపల్లి కృష్ణ, మల్లెల సురేష్, అడపా సత్యం, మారేపల్లి క్రీస్తు రాజు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0
0 views