logo

*హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమాన* *-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*


చీపురుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో 2022 సం.లో నమోదైన హత్య కేసులో నిందితుడు చీపురుపల్లి గ్రామం రామాంజనేయ కాలనీ కి చెందిన రాయిపల్లి మురళీ (33 సం.లు)కు జీవిత ఖైదు, రూ.2000/-లు జరిమాన విధిస్తూ డిశంబరు 12న డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ ఎం. బబిత గారు తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారు డిశంబరు 12న తెలిపారు.

వివరాల్లోకి వెళ్ళితే.. చీపురపల్లి గ్రామానికి చెందిన బంగారి రామ్మోహనరావుని తే. 18-08-2022 దిన ఎవరో గుర్తి తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపరిచినట్లు వరసుకు తమ్ముడైన బంగారి వెంకటేష్ అనే వ్యక్తి చీపురుపల్లి పోలీసులకు రిపోర్టు చేయగా అప్పటి చీపురుపల్లి ఎస్ఐ ఎ. సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. అనంతరం గాయపడిన వ్యక్తి బంగారి రామ్మోహనరావు చికిత్స పోందుతూ మరిణించారన్నారు. ఈ విషయమై మృతుడి తల్లి బంగారు లక్ష్మి ఫిర్యాదు మేరకు చీపురుపల్లి పోలీసులు ఆల్టరేషన్ మెమో ద్వారా హత్య కేసుగా నమోదు చేశారు. అనంతరం అప్పటి చీపురపల్లి సిఐ జి.సంజీవరావు కేసును దర్యాప్తు చేపట్టి, విచారణ చేసి ,నేరంకు పాల్పడినట్లుగా చీపురుపల్లి గ్రామానికి చెందిన నిందితుడు రాయిపల్లి మురళీని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.

ఈ కేసు విచారణలో నిందితుడు రాయిపల్లి మురళీపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత గారు నిందితుడికి జీవిత ఖైదు మరియు రూ.2000/- జరిమాన విధిస్తూ డిశంబరు 12న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడు శిక్షింపబడే విధంగా సాక్షులకు బ్రీఫ్ చేసి, సాక్ష్యం చెప్పే విధంగా చీపురుపల్లి కోర్టు కానిస్టేబులు జి.వ్యాస్, సి.ఎం.ఎస్. ఎస్ఐ పి.ఈశ్వరరావు సమర్ధవంతంగా పని చేసారన్నారు. పోలీసు వారి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించగా, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు,సిఐ జి.శంకరరావు, ఎస్ఐ ఎల్.దామెదరరావు ప్రాసిక్యూషను జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టిన ఎపిపి, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ అభినందించారు.

0
0 views