
కంచికచర్లలో పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్‌కు శంకుస్థాపన
62 లక్షల రూపాయల వ్యయం తో నిర్మాణం ప్రారంభం – ప్రజా ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తామని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల డిసెంబర్ 12 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
కంచికచర్ల పట్టణంలో ఆరోగ్య సేవలను మెరుగుపరచే దిశగా మరో కీలక అడుగు పడింది. 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా 62 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే పబ్లిక్ బ్లాక్ హెల్త్ యూనిట్ భవనం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వo ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ హెల్త్ యూనిట్ పూర్తయిన తర్వాత కంచికచర్ల, పరిసర గ్రామాల ప్రజలకు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకుప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆమె వివరించారు. గ్రామీణ ప్రాంతా లకు అత్యవసర వైద్యవసతులు అందించేందుకు ఇలాంటి కేంద్రాలు అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ కమిటీలఉపాధ్యక్షులు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.