logo

ఆళ్లగడ్డలో SDPI ఆధ్వర్యంలో ఘనంగాఅంబేద్కర్ వర్ధంతిని

ఆళ్లగడ్డ :: SDPI ఆధ్వర్యంలో స్థానిక ఆళ్లగడ్డ పట్టణంలోని అంబేద్కర్ వర్ధంతి మరియు యాంటీ ఫాసిస్టు డే కార్యక్రమం నిర్వహించబడింది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.SDPI ఆళ్లగడ్డ అసెంబ్లీ నాయకులు మాట్లాడుతూ, సమానత్వం – న్యాయం – సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
బాబ్రీ మసీదు కూల్చివేతను రాజ్యాంగ విరుద్ధ చర్యగా ఖండిస్తూ, నిజమైన న్యాయం జరగాల్సిందే అని పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ అసెంబ్లీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా నాయకులు జాఫర్ ,అసెంబ్లీ అధ్యక్షులు ముక్తాయర్ , జనరల్ సెక్రెటరీ ఫక్రుద్దీన్ గారు, యూసుఫ్ , ముస్లిం JAC నాయకులు బీరువాల భాషా , మాల మహానాడు నాయకులు ఇమ్మానుయేల్ , తాళ్లపాక వినోద్ కుమార్ , రాష్ట్ర ఆధ్వ నంద్యాల జిల్లా ఇంచార్జ్ బక్క వాళ్ళ చంద్రశేఖర్ గారు, మరియు బెలగల ఇమ్మానుయేల్ ,బైక్ మెకానిక్ నూర్ భాషా ,హుస్సేన్ భాషా తదితరులు పాల్గొన్నారు.

14
996 views