logo

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం....


నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. న్యాయ కోవిదుడు, ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి తారకరామ కాలనీ లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముందుగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజలు ప్రాథమిక హక్కులకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు తీవ్ర విఘాతం కలిగించడమే కాకుండా, రాజ్యాంగ మనుగడకు, దేశ సమగ్రతకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అణగారిన వర్గాలకు అందించడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని. ఇప్పటికి దళిత మైనారిటీ గిరిజనులపై హత్యలు హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వలన అనగారిన వర్గాలపై దాడులు మరింత ఎక్కువ అయ్యాయని. బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మోడీ. అమిత్షాలు కంకణం కట్టుకున్నారని. గిరిజనుల సంపద అయినటువంటి అటవీ భూముల్లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేయడానికి ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని అన్నారు. మన దేశంపై బాంబుదాడులు చేస్తున్న తీవ్రవాదులను పట్టుకుని వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్న పాలకులు. మన భారతదేశ పౌరులు అయినటువంటి మావోయిస్టులు తుపాకీ వీడి చర్చలకు వస్తామని చెప్పిన అవేవీ పట్టించుకోకుండా అడవుల నుండి గిరిజనులను పూర్తిగా తరిమివేసి అపారమైన కనిజ సంపదను దోచుకోవడానికి అర్బన్ లక్సలైట్ల పేరుతో అమాయకపు గిరిజనులను చంపుతున్నారని అన్నారు. ఇప్పటికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కోసం ప్రజలందరూ భవిష్యత్తులో జరిగే పోరాటాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మునకాల శ్రీనివాస్. కోట అప్పన్న. దళిత హక్కుల పోరాట సమితి బొబ్బిలి పట్టణ కార్యదర్శి గొల్లపల్లి తౌడు. సిపిఐ పట్టణ నాయకులు నాయకులు పొడుగు అశోక్. పులుసు వెంకట సత్యనారాయణ. పాలూరి కృష్ణ. తదితరులు పాల్గొన్నారు

2
569 views