
డిసెంబర్ 7న బ్రెయిన్ యోగా తరగతులు...
ఓం నమః అంతర్జాతీయ బ్రెయిన్ యోగ పురస్కార గ్రహీత అయినటువంటి బ్రెయిన్ యోగి శ్రీనివాసులు చేత డిసెంబర్ 7వ తేదీ ఆదివారం విజయనగరంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం 8 గంటలకు బ్రెయిన్ యోగ తరగతులు ప్రారంభమగును. 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లలు ఇందులో పాల్గొనవచ్చు. ఇందులో విశేషమేమంటే సాయంత్రం నాలుగు వరకు క్లాసులు జరుగుతాయి క్లాసులు అనంతరం పిల్లలకి కళ్ళకి గంతలు కట్టినప్పటికీ ఏ పుస్తకం చదవమంటే చదివేయగలగడం, రంగులు, నంబర్లు గుర్తించగలగటం, రంగులు వేయగలగటం చేసేయగలరు. ఇంతటి మహత్తరమైన శక్తి సామర్థ్యాలను ఏకాగ్రమైన మనస్సే చేయగలదు. అట్టి వారికే బుద్ధి వికసిస్తుంది బుద్ధిమంతులైన వాళ్లే సమాజానికి, దేశానికి, ప్రపంచానికి శ్రేయస్సు చేకూర్చి శాంతి సౌఖ్యాలను అందించగలరు అట్టి సమాజ శ్రేయస్సును కోరుకునే సహృదయులందరూ కూడా ఇట్టి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటూ అందరికీ తెలియజేయగలరని ఆశిస్తూ ఆకాంక్షిస్తూన్నామని అమృత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఆరిశెట్టి ఇందుమణి గారు తెలిపారు. ఇదే సందర్భంలో అమృత సంస్థ ఆంధ్ర యూనివర్సిటీ తో అనుబంధితమైనటువంటి యోగాలో డిప్లమా పీజీ డిప్లమా కోర్సుల్లో జాయిన్ అయినా మూడవ బ్యాచ్ విద్యార్థులకు ప్రారంభోత్సవ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా బ్రెయిన్ యోగి శ్రీనివాసులు తో పాటుగా విజయనగరంలో ప్రముఖ ఆడిటర్ , అష్టలక్ష్మి ఆలయ నిర్మాత, ధర్మకర్త అయినటువంటి దుర్గా బాలాజీ బిజెపి కన్వీనర్, నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన బూర్ల శ్రీధర్, శ్రీ పంచముఖ ఆంజనేయ నిత్య అన్న ప్రసాద వితరణ సంస్థ కార్యదర్శి, పెంటపాటి కామరాజు అనగా జైశ్రీరామ్ , శ్రీ వాసవి ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులైన వబ్బిలి శెట్టి వెంకట సత్యనారాయణ అనగా ఏడుకొండలు కూడా విచ్చేయుచున్నారు. కార్యక్రమం అనంతరం అన్న ప్రసాదం స్వీకరించగలరని కోరుతున్నారు. ఓం నమః